Tuesday, November 25, 2014

ఈ నదిలా నా హృదయం

చిత్రం :  చక్రవాకం (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ 




పల్లవి :


ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. వెతుకుతు వెళుతూంది     

     

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది

ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. 

వెతుకుతు వెళుతూంది.. వెతుకుతు వెళుతూంది


చరణం 1 :


వలపు వాన చల్లదనం తెలియనిది.. వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది.. వయసు వరద పొంగు సంగతే ఎరగనిది


కలల కెరటాల గలగలలు రేగనిది..
కలల కెరటాల గలగలలు రేగనిది.. గట్టు సరిహద్దు కలతపడి దాటనిది
ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో..


ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది

         

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది..
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. వెతుకుతు వెళుతూంది    


చరణం 2 :


అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది.. అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది.. అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది


మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది


ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది   

             
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతూంది.. వెతుకుతు వెళుతూంది



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2382

No comments:

Post a Comment