Monday, November 3, 2014

నిలువవే వాలు కనులదానా

చిత్రం :  ఇల్లరికం (1959)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల 



పల్లవి : 


నిలువవే వాలు కనులదానా.. వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నవే తానా
నువ్వు కులుకుతూ ఘలఘల
 నడుస్తూ ఉంటే

నిలువదే నా మనసు..  ఓ లలనా అది నీకే తెలుసు 

నిలువవే వాలు కనులదానా.. వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నవే తానా

చరణం 1 :


ఎవరని ఎంచుకోనినావో పరుడని భ్రాంతిపడినావో
ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పడినావో
సిగ్గుపడి తోలిగేవో... విరహాగ్నిలో నను తోసిపోయేవో


నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు
ఓ లలనా...  అది నీకే తెలుసు 


చరణం 2 :


ఒకసారి నన్ను చూడరాదా.. చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా
వగలాడి నే నీవాడనే కాదా?


నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు
ఓ లలనా..  అది నీకే తెలుసు
 


చరణం 3 : 


మగడంటే మొజులేనిదానా.. మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేనిదానా .. నీకు నేను లేనా
కోపమా నా పైనా?
నీ నోటి మాటకే నోచుకోలేనా?

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నవే తానా
నువ్వు కులుకుతూ  ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు
ఓ చెలియా.. ఓ మగువా.. ఓ.. లలనా అది నీకే తెలుసు
 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1008

No comments:

Post a Comment