Monday, December 1, 2014

కల చెదిరిందీ... కథ మారిందీ

చిత్రం :  దేవదాసు (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు 



పల్లవి : 



కల చెదిరిందీ... కథ మారిందీ
కన్నీరే ఇక  మిగిలిందీ..  కన్నీరే ఇక మిగిలిందీ
కల చెదిరిందీ.. కథ మారిందీ
కన్నీరే ఇక మిగిలిందీ...  కన్నీరే ఇక మిగిలిందీ 


చరణం 1 :



ఒక కంట గంగ.. ఒక కంట యమునా
ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ..  ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ
ఆ...ఆ....ఆ....ఆ... ఆ...ఆ....ఆ....ఆ...
కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు రాకూడదూ 
చెలి కన్నుల  చెమరింపు రాకూడదూ


కల చెదిరిందీ...  కథ మారిందీ..
కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ




చరణం 2 :


మనసొక చోట మనువొక చోట మమతలు
పూచిన పూదోట మమతలు పూచిన పూదోట
ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట
కుశలాన ఉండాలి ఆ చోట


కల చెదిరిందీ.. కథ మారిందీ...
కన్నీరే ఇక మిగిలిందీ...  కన్నీరే ఇక మిగిలిందీ





No comments:

Post a Comment