Monday, December 8, 2014

తెలుసుకో ఈ జీవిత సత్యం

చిత్రం :  ఆలుమగలు (1977)
సంగీతం :  టి.చలపతిరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం :  బాలు




సాకి : 


ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు
అంతులేని సుఖదుఃఖాలలో అందరూ సహాధ్యాయులే





పల్లవి:


తెలుసుకో ఈ జీవిత సత్యం.. జరిగేదే ఇది ప్రతినిత్యం
ఏ వయసునకా చోటుంది.. అక్కడే నీకు పరువుంది
అప్పుడే నీకు సుఖముంది ..
తెలుసుకో ఈ జీవిత సత్యం.. జరిగేదే ఇది ప్రతినిత్యం




చరణం 1 :


కడుపులో శిశువు కదిలి కుదిపితే.. అదియే తల్లికి ఆనందం
అక్కున చేర్చిన కొడుకు తన్నితే.. అదియే తండ్రికాహ్లాదం
ఎదిగిన సుతులే మమతలు మరచి ఎదురు తిరిగితే
నువ్వెక్కడ?..  నీ పరువెక్కడ?.. నీ చోటెక్కడ?


తెలుసుకో ఈ జీవిత సత్యం.. జరిగేదే ఇది ప్రతినిత్యం



చరణం 2 :



తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం
తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం


ఆ ఉబలాటం ఆ అనురాగం కరువైపోతే
నువ్వెక్కడ? .. నీ పరువెక్కడ?.. నీ తోడెక్కడ?.. నీ నీడెక్కడ? 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1260

No comments:

Post a Comment