Sunday, December 14, 2014

కలిమీ లేములు కష్ట సుఖాలు

చిత్రం :  భాగస్తులు (1975)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :



కలిమీ లేములు కష్ట సుఖాలు..
కావడి కుండలే.. తెలుసా మనసా . . కావడి కుండలే.. తెలుసా 


ఈ మమకారం ఈ ఆరాటం..
ఎందు కోసమే ఓ వెఱ్ఱి మనసా.. తెలుసా ఓ వెఱ్ఱి మనసా        

  
కలిమీ లేములు కష్ట సుఖాలు..
కావడి కుండలే తెలుసా...  మనసా..  కావడి కుండలే తెలుసా
 




చరణం 1 :


వంచించే వారే గెలిచారుగా..  మన మంచి మనకే ఎదురాయెగా
వంచించే వారే గెలిచారుగా..  మన మంచి మనకే ఎదురాయెగా


మన మంచీ ఎన్నటికి మాసి పోదులే.. మన మంచీ ఎన్నటికి మాసి పోదులే
వున్నదే వుంటు౦ది ఓ మనసా.. పరితాపం పడుతుంటే ఫలమేమిటి?



కలిమీ లేములు కష్ట సుఖాలు..
కావడి కుండలే తెలుసా మనసా . . కావడి కుండలే తెలుసా
 



చరణం 2 :



కరుణి౦చే వాడే కరువాయెనే..  మన జీవితాలే బరువాయెనే
కరుణి౦చే వాడే కరువాయెనే.. మన జీవితాలే బరువాయెనే


మనసుంచి శ్రమ పడటం మన వంతులే..  మనసుంచి శ్రమ పడటం మన వంతులే
ఫలితంతో పని యేలా ఓ మనసా..  ఆ దైవం మన వెంట వున్నాడులే


కలిమీ లేములు కష్ట సుఖాలు..
కావడి కుండలే తెలుసా మనసా..  కావడి కుండలే తెలుసా  


ఈ మమకారం ఈ ఆరాటం..
ఎందుకోసమే ఓ వెఱ్ఱి మనసా . . తెలుసా ఓ వెఱ్ఱి మనసా
 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7821

No comments:

Post a Comment