Thursday, December 11, 2014

ఒక జంట కలిసిన తరుణాన

చిత్రం :  బాబు (1975)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల, రామకృష్ణ



పల్లవి :



ఒక జంట కలిసిన తరుణాన..
జే గంట మ్రోగెను గుడిలోన.. ఆ హ్రదయాల శ్రుతిలోన
ఒక జంట కలిసిన తరుణాన..
జే గంట మ్రోగెను గుడిలోన.. ఆ హ్రదయాల శ్రుతిలోన



చరణం 1 :


కలిమి లేమి జంటలనీ.. అవి కలకాలంగా ఉన్నవనీ
కలిమి లేమి జంటలనీ.. అవి కలకాలంగా ఉన్నవనీ


ఋజువు చేయమని మన ఇద్దరినీ.. కాలం నేటికి కలిపెననీ
వెలుగూ నీడగ ఉండమనీ..
వెలుగూ నీడగ వుండమనీ.. వలపు గెలుపుగా గుర్తుండమని



ఒక జంట కలిసిన తరుణాన..
జే గంట మ్రోగెను గుడిలోన.. ఆ హ్రదయాల శ్రుతిలోన



చరణం 2 :  


పెద్దరికానికి పేదరికానికి ప్రేమే నిలబడి పెళ్ళి చేసెను..  ఆ.. ఆ... ఆ..
పెద్దరికానికి పేదరికానికి ప్రేమే నిలబడి పెళ్ళి చేసెను


సూర్యచంద్రులు వెలిగే వరకూ తారలన్నీ మెరిసే వరకూ
సూర్యచంద్రులు వెలిగే వరకూ తారలన్నీ మెరిసే వరకూ
జాతి మతాలూ సమసే వరకూ..  జన్మలన్నీ ముగిసే వరకూ
శతమానం భవతీ..  శత శతమానం భవతీ..  తధాస్తు.. తధాస్తు.. తధాస్తు..



ఒక జంట కలసిన తరుణాన.. ఒక గుండె రగిలెను ద్వేషాన
ఆ హ్రుదయాలు విడదీయు పంతాన
తరతరాల ఈ వంశ గౌరవం తగులబెట్టినావు



చరణం 3 :  


తరతరాల ఈ వంశ గౌరవం తగులబెట్టినావు

తాళిగట్టి ఈ దరిద్రాన్ని నీ వెంట తెచ్చినావూ

అని గర్జించిందొక కన్న తండ్రి కంఠం

సిరి సంపదలు నిలకడకావు.. పరువు ప్రతిష్టలు వాటితో రావు

మాట తప్పడం కాదు గౌరవం.. మనసు మమతే మనిషంటే 

అని మనవి చేసె నొక కన్నబిడ్డ హ్రుదయం



కులమూ కులమూ జాతీ జాతని గాండ్రించిందా పెద్దతరం 

గుణమే కులమని నీతే జాతని వాదించిందా యువతరం

తండ్రీ కొడుకుల బంధం నేటితో తెగిపొతుందీ 

అనురాగపు అనుబంధం తలవంచక వుంటుంది

పోరా పో పోతే పో..  నాశనమై పో..  పోతుందీ వంశం నా తోనే పోనీ.. పోనీ.. పోనీ .. పోనీ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2396

No comments:

Post a Comment