Tuesday, December 16, 2014

విన్నారా.. అలనాటి వేణుగానం

చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 




పల్లవి :


మరల రేపల్లెవాడలో.. మురళి మోగె
మోడువారిన హృదయాలు పూయసాగె.. 


విన్నారా..  విన్నారా..
అలనాటి వేణుగానం మోగిందె మరల.. అలనాటి వేణుగానం మోగిందె మరల
చెలరేగే మురళీ సుధలు.. తలపించును కృష్ణుని కథలు..  విన్నారా 



చరణం 1 :


పుట్టింది ఎంతో గొప్పవంశం.. పెరిగింది ఏదో మరో లోకం
పుట్టింది ఎంతో గొప్పవంశం..  పెరిగింది ఏదో మరో లోకం


అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు
అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు
చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు


దొంగైనా.. దొర అయినా.. మనసే హరించేనులే    

 
విన్నారా.. అలనాటి వేణుగానం మోగిందె మరల
అలనాటి వేణుగానం.. మోగిందె మరల



చరణం 2 :  



ద్వేషించే కూటమిలోన నిలచి..  ప్రేమించే మనిషేకదా మనిషి
ద్వేషించే కూటమిలోన నిలచి..  ప్రేమించే మనిషేకదా మనిషి


ఆడేది నాటకమైనా పరుల మేలు  తలచాడు
ఆడేది నాటకమైనా పరుల మేలు  తలచాడు
అందరికీ ఆనందాల బృందావని నిలిపాడు


ఆ నాడు..  ఈ నాడు మమతే తరించేనులే  


విన్నారా.. అలనాటి వేణుగానం మోగిందె మరల
చెలరేగే మురళీ సుధలు.. తలపించును కృష్ణుని కథలు..  విన్నారా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=687

No comments:

Post a Comment