Tuesday, December 16, 2014

రింజిం రింజిం హైదరబాద్

చిత్రం :  మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు  




పల్లవి :


రింజిం రింజిం హైదరబాద్ . . రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్ . . రిక్షావాలా జిందాబాద్ 



చరణం 1 :


అటు చూస్తే చార్మినారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు
అటు చూస్తే చార్మినారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు


ఆ వంకా అసెంబ్లీ హాలు..  ఈ వంకా జూబిలి హాలూ
తళ తళ మెరిసే.. తళ తళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ


రింజిం రింజిం హైదరబాద్..  రిక్షావాలా జిందాబాద్




చరణం 2 :  



ఒక తలపై రూమీ టోపీ . . ఒక తలపై గాంధీ టోపీ
ఒక తలపై రూమీ టోపీ . . ఒక తలపై గాంధీ టోపీ


క్యా భాయి అని అంటాడొకడూ . . ఏమోయీ అని అంటాడొకడూ
మతాలు భాషలూ వేరైనా . . మతాలు భాషలూ వేరైనా . . మనమంతా భాయీ భాయీ


రింజిం రింజిం హైదరబాద్ . . రిక్షావాలా జిందాబాద్


చరణం 3 :



ఉన్నవాడికి తింటే అరగదు . . లేనివాడికి తిండే దొరకదు
ఉన్నవాడికి తింటే అరగదు . . లేనివాడికి తిండే దొరకదు 


పరుపులున్నా పట్టదు నిదర . . కరుకు నేలను గురకలు వినరా
హెచ్చు తగ్గులు తొలిగే రోజూ . . హెచ్చు తగ్గులు తొలిగే రోజూ . . ఎపుడొస్తుందో ఏమో

 
రింజిం రింజిం హైదరబాద్ . . రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే . . మోటరు కారు బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్ . . రిక్షావాలా జిందాబాద్


లలల లలాల లలల లలాల లలల లలాల లా లా
లలల లలాల లలల లలాల లలల లలాల లా లా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4503

No comments:

Post a Comment