Sunday, December 7, 2014

చిక్కావు చేతిలో చిలకమ్మా

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  రామకృష్ణ 





పల్లవి :


చిక్కావు చేతిలో చిలకమ్మా.. నీవు  ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా.. హా.. హా..
చిక్కావు చేతిలో చిలకమ్మా.. నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా.. హా.. హా..
చిక్కావు చేతిలో చిలకమ్మా.. 



చరణం 1 :



నీ కోరచూపు చూచి.. బెదిరి పోదునా
కస్సు బుస్సు మనగానే.. అదిరిపోదునా 


పొగరంతా.. అణిగిందా.. పొగరంతా.. అణిగిందా బిగువంతా తగ్గిందా
తప్పు ఒప్పుకుంటావా.. చెంపలేసుకుంటావా 


చిక్కావు చేతిలో చిలకమ్మా.. నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా
ఆ.. ఆ.. ఆ.. చిక్కావు చేతిలో చిలకమ్మా... 




చరణం 2 :



కల్లబొల్లి మాటలతో కైపెక్కిస్తావా
హొయలు వగలు చూపించీ వల్లో వేస్తావా


నాటకాలు ఆడేవా.. నాటకాలు ఆడేవా.. నవ్వులపాలు చేసేవా...
నీ టక్కులు సాగవమ్మా.. నీ పప్పులు ఉడకవమ్మా 


చిక్కావు చేతిలో చిలకమ్మా.. నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా
ఆ... ఆ... ఆ... చిక్కావు చేతిలో చిలకమ్మా...



చరణం 3 :

మోసాన్ని మోసంతోటే పందె మేసి గెలిచాను
వేషానికి వేషం వేసీ ఎదురుదెబ్బ తీశాను


మోసాన్ని మోసం తోటే పందె మేసి గెలిచాను
వేషానికి వేషం వేసీ ఎదురుదెబ్బ తీశాను


గర్వాన్ని వదిలించీ.. గర్వాన్ని వదిలించీ
కళ్ళు బాగా తెరిపించీ.. కాళ్ళ బేరానికి నిన్నూ రప్పించాను 


చిక్కావు చేతిలో చిలకమ్మా.. నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా
ఆ.. ఆ.. ఆ.. చిక్కావు చేతిలో చిలకమ్మా...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1182

No comments:

Post a Comment