Tuesday, December 30, 2014

మన్ని౦చుమా ప్రియా

చిత్రం :  నా పేరే భగవాన్ (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


మన్ని౦చుమా ప్రియా మన్నించుమా
మరుమల్లె నల్లగా ఉంటే.. చిరునవ్వు చేదుగా ఉంటే
ఆ తప్పు నాది కాదంటే . . మన్ని౦చుమా ప్రియా మన్నించుమా


చరణం 1 :


నా కంటి కులుకులలోన.. నీ కలలు చెదురుతు వుంటే
నా కాలి చిందులలోన.. నీ గుండె నలుగుతు వుంటే
సగము రేయి రగలిపోయి.. సేగలు గా మారిపోతుంటే


ఆ తప్పు నాది కాదంటే.. మన్ని౦చుమా ఆ ఆ
మన్ని౦చుమా ప్రియా మన్నించుమా
 



చరణం 2 :



ఆలనాటి బాసలన్నీ సెలఏటి రాతలైతే
కుసుమించు ఆశలన్నీ వసివాడి రాలిపోతే
పెదవి వణికీ మధువు తోణికీ హృదయమే తూలి పొతుంటే 


ఆ తప్పు నాది కాదంటే..మన్ని౦చుమా.. ఆ.. ఆ.. ఆ
మన్ని౦చుమా ప్రియా మన్నించుమా  


మరుమల్లె నల్లగా ఉంటే.. చిరునవ్వు చేదుగా ఉంటే
ఆ తప్పు నాది కాదంటే.. మన్ని౦చుమా ప్రియా మన్నించుమా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4759

No comments:

Post a Comment