Wednesday, December 3, 2014

చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా

చిత్రం  :  పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం  :  సత్యం
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  సుశీల



పల్లవి :


చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు 


చిన్నారి కన్నయ్యా..  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు
 




చరణం 1 :


మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
కట్టుకున్న పతికే బరువై కన్నీరై కరిగేను ఎంత కాలమో... ఈ వియోగము
ఇంతేనా ఈ జీవితం... బాబూ.. పంతాలా పాలాయెనా



చిన్నారి కన్నయ్యా...  నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు
 




చరణం 2 :




రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
చిక్కు ప్రశ్నలెన్నోవేసి చిక్కులలో చిక్కాను
బోసినవ్వుతో బుంగమూతితో మార్చాలీ మీ మామను
బాబూ చేర్చాలి...  మీ నాన్నను



చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు..నీవే కలపాలీ మా మనసులు 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3065

No comments:

Post a Comment