Wednesday, December 17, 2014

సుడిగాలిలోన దీపం

చిత్రం :  జీవిత చక్రం (1971)
సంగీతం :  శంకర్ జైకిషన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల 



పల్లవి :


సుడిగాలిలోన దీపం.. కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం..  



చరణం 1 :



లోకాన పన్నీరు జల్లేవులే.. నీకేమొ కన్నీరు మిగిలిందిలే
పెరవారి గాయాలు మాన్చేవులే.. నీలోన పెనుగాయ మాయేనులే
నీలోన పెనుగాయ మాయేనులే
అణగారిపోవు ఆశ.. నీవల్లనే  ఫలించె 


సుడిగాలిలోన దీపం.. కడవరకు వెలుగునా..
సుడిగాలిలోన దీపం.. 



చరణం 2 :


ఒక కన్ను నవ్వేటి వేళలో.. ఒక కన్ను చమరించసాగునా?
ఒకచోట రాగాలు వికసించునా.. ఒక చోట హృదయాలు ద్రవియించునా ?
ఒకచోట హృదయాలు ద్రవియించునా?
ఎనలేని ప్రాణదానం.. ఎద బాధ తీర్చునా?..  

సుడిగాలిలోన దీపం.. కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం




No comments:

Post a Comment