Saturday, December 27, 2014

ఇరుసులేని బండి

చిత్రం :  పాడిపంటలు (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు,  సుశీల 

పల్లవి : 

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి.. చిరతలే లేనిది చిన్నోడి బండి

ఆ..  తొట్టిలో ఉన్నాడు జగమొండి.. వాడి దూకుడికి ఆగలేరు తప్పుకోండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి.. చిరతలే లేనిది చిన్నోడి బండి 

చరణం 1 :

వయసులోనే ఉన్నది దూకుడన్నది..  దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది

చిన్నదాని చేతిలో చిరతలున్నవి.. ఎంత చెలరేగినా నీకు హద్దులున్నవి

హద్దులన్ని సద్దులేని ముద్దులతో చెరిగిపోతవి
తందనా తనానాన తందనాన.. తందనా తనానాన తందనాన
 
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి.. చిరతలే లేనిది చిన్నోడి బండి

చరణం 2 :

ఎగిరెగిరిపడుతున్న కోడెగిత్తలు.. అవి ఏనాడు మోయలి మోపెడంతలు

ఎత్తుపల్లం చూస్తేనే ఇన్నిగంతులు.. మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు

పగాలు లేనినాడు పంతాలు గెలవలేవూ..
దసరిగరిసనిద దదద...  పనిసరిసని దప పపప    
     
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి.. చిరతలే లేనిది చిన్నోడి బండి

చరణం 3 :

పచ్చని వరిచేను పరువంలో ఉన్నది.. పైరగాలి తగలగానే పులకరించుచున్నది

పులక పులకలో వలపు గిలిగింత ఉన్నది.. వలపుపంట ఎప్పుడని కలలు గంటున్నది

సంకురాత్రి పండుగకే సంబరాలు కాసుకున్నవి . . హోయ్‌  

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి.. చిరతలే లేనిది చిన్నోడి బండి

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3595

No comments:

Post a Comment