Sunday, December 7, 2014

అమ్మా.. అమ్మా అని పిలిచావు

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల  

పల్లవి :

అమ్మా.. అమ్మా.. అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు
ఏ తల్లి కన్న బాబువో.. నా కాళ్ళకు బంధం అయినావు

అమ్మా.. అమ్మా.. అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు
ఏ తల్లి కన్న బాబువో.. నా కాళ్ళకు బంధం అయినావు  
  
చరణం 1 :

ఎవరికీ మనసివ్వని దానను..  ఏ మమతకూ నోచుకోని బీడును
ఎవరికీ మనసివ్వని దానను..  ఏ మమతకూ నోచుకోని బీడును 

మోడులా యీ బ్రతుకును మోశాను..

మోడులా ఈ బ్రతుకును మోశాను..

నీ ముద్దుమోము చూచి మరల మొలకెత్తాను  

అమ్మా..  అమ్మా అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు
ఏ తల్లి కన్న బాబువో.. నా కాళ్ళకు బంధం అయినావు 

చరణం 2 :

కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు.. కడుపు తీపి తీరని తల్లిని నేను
కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు.. కడుపు తీపి తీరని తల్లిని నేను 

కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో..
కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో..
ఒకరి కొరత నింకొకరు తీర్చుకునేటందుకో 

అమ్మా.. అమ్మా అని పిలిచావు.. ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు
ఏ తల్లి కన్న బాబువో... నా కాళ్ళకు బంధం అయినావు
అమ్మా.. అమ్మా అని పిలిచావు .. 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6519

2 comments:

  1. మన తెలుగు పాటల సాహిత్యం అందిస్తున్న మీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు. ఇక పై పాటకు (అమ్మా..అమ్మా..అని పిలిచావు)పాట ఆత్రేయ గారు వ్రాసారు అనుకుంటా. ఒకసారి పునరాలోచించగలరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete