Friday, December 19, 2014

ఒకటి రెండు మూడైతే

చిత్రం :  బాలరాజు కథ (1970)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల

పల్లవి :

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు
వద్దు.. వద్దు... వద్దు

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు
వద్దు... వద్దు... వద్దు

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు

చరణం 1 :

పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్లగ ఇస్తాడు
పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్లగ ఇస్తాడు
దరిద్రాన్ని జత చేస్తాడు

సంతులేనిదే స్వర్గం లేదని ఏ మగవాడూ అనుకోడు
సంతులేనిదే స్వర్గం లేదని ఏ మగవాడూ అనుకోడు
ఇడుగో మొనగాడున్నాడు
ఇడుగో మొనగాడున్నాడు

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు

చరణం 2 :

ఇలాగ జనాభా పెరుగుతు ఉంటే సాపాటు సంగతి ఏలాగు?
ఇలాగ జనాభా పెరుగుతు ఉంటే సాపాటు సంగతి ఏలాగు?
సంతానమంతా దిగజారు

రెక్కల కష్టం.. చేసే వాళ్ళకు
రెక్కల కష్టం చేసే వాళ్ళకు బతుకంతా హాయిగ జరుగు
రెక్కల కష్టం చేసే వాళ్ళకు బతుకంతా హాయిగ జరుగు
ఇంతమందైతే ఏలాగు? మరింత మందైతే ఏలాగు?

వద్దు వద్దు వద్దు
ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు

చరణం 3 :

సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు
సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు 

ఒక్కరు వెనుకాడరు మీరుకూడ హాజరు
ఒక్కరు వెనుకాడరు మీరుకూడ  హాజరు

కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు
కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు
ఆ దెబ్బతో తారుమారు.. ఆపవయ్యా నీ జోరు

వద్దు... వద్దు... వద్దు
ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు

చరణం 4 :

గంపెడు పిల్లలు కన్న కుచేలుడు కుయ్యో మొఱ్ఱో అన్నాడు
గంపెడు పిల్లలు కన్న కుచేలుడు కుయ్యో మొఱ్ఱో అన్నాడు

పస్తులెన్నో పడుకున్నాడు
శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆదుకున్నాడు
శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆదుకున్నాడు
ఇప్పుడు మనకెవడున్నాడు?

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు
వద్దు... వద్దు... వద్దు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6552

No comments:

Post a Comment