Sunday, December 7, 2014

మంచి అన్నదే కానరాదు

చిత్రం :  పాప౦ పసివాడు (1972)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, బాలు 

పల్లవి :

అరె.. మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
హొయ్.. నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
అరె.. చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్   

మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్

చరణం 1 :

ఆపద వస్తే.. బావురంటరూ.. బావురంటరూ
అయ్యో.. బాబని కాళ్ళబడతరు.. కాళ్ళబడతరు
ఏరుదాటి ఒడ్డుకు చెరిందే.. తెప్పకాల్చి పోతారయ్యో
ఏరుదాటి ఒడ్డుకు చెరిందే.. తెప్పకాల్చి పోతారయ్యో  
కుక్కకు ఉన్న విశ్వాసం.. ఈ నరుడికి లేదయ్యో   

మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్  

చరణం 2 :

నావాడంటే..  ప్రాణం ఇస్తాం.. నమ్మామంటే..  మా తలదీస్తాం
చెప్పిన మాటా చెల్లిస్తాం.. కోయరాజులం అనిపిస్తాం
చెప్పిన మాటా చెల్లిస్తాం..  కోయరాజులం అనిపిస్తాం
దొంగచాటుగా ద్రోహం చేస్తే.. అమ్మకు బలి ఇస్తాం.. 

మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా.. హత్తెరి
నీతి అన్నదే లేనేలేదు మనసులలోనా.. హత్తెరి
చేసిన మేలూ గంగలో కలిపీ గొంతులు కోస్తారోయ్  

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7857

No comments:

Post a Comment