Sunday, December 7, 2014

మబ్బులు రెండు భేటి అయితే

చిత్రం : దేశోద్ధారకులు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 

పల్లవి :

ఉమ్మ్..ఉమ్మ్.. ఉమ్హుహుహు..ఓహొహొహో..హోహోహోహో..
ఆహహహ ఆహహహా.. ఉమ్మ్..ఉమ్మ్.. ఉమ్మ్

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది
మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది 

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది
మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది
మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది 

చరణం 1 :

మూడు ముళ్ళూ పడతాయంటే.. సిగ్గే మొగ్గలు వేస్తుంది
మూడు ముళ్ళూ పడతాయంటే.. సిగ్గే మొగ్గలు వేస్తుంది

అ మొగ్గలు పూచీ మూడు రాత్రులు.. తీయని ముద్రలు వేస్తాయి
అ మొగ్గలు పూచీ మూడు రాత్రులు.. తీయని ముద్రలు వేస్తాయి 

కన్నులు నాలుగు కలిశాయంటే.. పున్నమి వెన్నెల కాస్తుంది
అ వెన్నెల నాలుగు వారాలైనా.. తరగని వెలుగై వుంటుంది  

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది
మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది
మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది  

చరణం 2 :

అయిదో తనమే అడజన్మకు అన్ని వరాలను మించింది
అయిదో తనమే అడజన్మకు అన్ని వరాలను మించింది 

అ వరాన్ని తెచ్చిన మగువే మగనికి అరో ప్రాణం అవుతుంది
అ వరాన్ని తెచ్చిన మగువే మగనికి అరో ప్రాణం అవుతుంది 

అడుగులు ఏడూ నడిచామంటే అనుబందం పెనవేస్తుంది
అ అనుబంధం ఏడేడు జన్మలకు వీడని బంధం అవుతుంది 

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది
మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది 

మబ్బులు రెండు భేటి అయితే మెరుపే వస్తుంది
అహహాహా.. అహహాహా..  అహహాహా..  అహహాహా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=683

No comments:

Post a Comment