Monday, December 1, 2014

చంద్రగిరి చంద్రమ్మా

చిత్రం :  దొరబాబు (1974)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల



పల్లవి : 



చంద్రమ్మా.. చంద్రగిరి చంద్రమ్మా..
చంద్రమ్మా.. చంద్రగిరి చంద్రమ్మా .. 


చంద్రగిరి చంద్రమ్మా.. సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక.. అలసిపోక వుండమ్మా..
చంద్రగిరి చంద్రయ్యా.. సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి..  ఆకలేసి వుండయ్యా ..
చంద్రగిరి చంద్రమ్మా... ఆ.. ఆ.. ఆ


చరణం 1 :



వల్లమాలిన వయసేమో వెల్లువంటిది..
దాని కాశయాల కానకట్ట వేసుకోవాలీ.. ఆనకట్టనే వేసుకోవాలీ
ఆడది మగవాడు ఆడుతూ పాడుతూ..  ఆడది మగవాడు ఆడుతూ పాడుతూ
దాన్ని మళ్ళించి మంచితనం పండించాలి 


చంద్రగిరి చంద్రమ్మా.. సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక.. అలసిపోక వుండమ్మా
చంద్రగిరి చంద్రమ్మా..ఆ.. ఆ...ఆ.. 




చరణం 2 :


మట్టి నీళ్ళల్లా మనమేకం కావాలి.. చెట్టాపట్టగ చెయి పట్టి నడవాలీ
పట్టీ నడవాలి.. చెయి పట్టి నడవాలీ
పుట్టినందుకేదైన గట్టి పనిచేయాలి.. పుట్టినందుకేదైన గట్టి పనిచేయాలి
పుట్టబోయేవాళ్ళు మన పేరు చెప్పుకోవాలీ 


చంద్రగిరి చంద్రయ్యా.. సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి.. ఆకలేసి వుండయ్యా .. చంద్రగిరి చంద్రయ్యా.. ఆ.. ఆ... ఆ


చరణం 3 :

కావేరి గోదావరి గంగా కృష్ణమ్మలను..
కలిపేసి నిలవేసి కక్షలను మాపాలి..
కక్షలను మాపాలి.. కక్షలను మాపాలి
ప్రతిపల్లె పెళ్ళికాని పడుచుపిల్ల కావాలి..
ప్రతిపల్లె పెళ్ళికాని పడుచుపిల్ల కావాలి
పంటలక్ష్మి యింటింటా భరతనాట్యమాడాలీ 


చంద్రగిరి చంద్రమ్మా..  సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక..  అలసిపోక వుండమ్మా..
చంద్రగిరి చంద్రయ్యా..  సందేళ కొస్తానయ్యా
అందాక పని చేసి.. ఆకలేసి వుండయ్యా..చంద్రగిరి చంద్రమ్మా.. 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1788

No comments:

Post a Comment