Saturday, December 27, 2014

మాతృత్వం లోనే ఉంది

చిత్రం  :  కుల గౌరవం (1972)
సంగీతం  : టి. జి. లింగప్ప
గీతరచయిత  : కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి : 


మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం


మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం 



చరణం 1 :



స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారూ
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారూ
స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారూ
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారూ

మబ్బువెంట నీరువలే.. పువ్వునంటు తావివలే
మబ్బువెంట నీరువలే.. పువ్వునంటు తావివలే
అనుశృతముగా వచ్చును ఈ సంబంధం ఈ అనుబంధం
ఆలుమగలు బ్రతుకున పండించుకొన్న పరమార్థం  

మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్దకం ఆడజన్మ సార్దకం 


చరణం 2 :


ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నది
ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నది 



అంతా అనురాగమయం.. ఆనందానికి నిలయం
అంతా అనురాగమయం.. ఆనందానికి నిలయం
పతి హృదయమే సతికి నిత్య సత్యమైన ఆలయం.. పూజించే దేవాలయం
భర్తయే భార్యకు ఇలలో వెలసిన దైవం.. వెలసిన దైవం



మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకొనుటే స్త్రీ మూర్తికి గౌరవం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=156

No comments:

Post a Comment