Friday, December 5, 2014

ఎవరిని అడగాలి

చిత్రం :  గాంధీ పుట్టిన దేశం (1973)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :



ఎవరిని అడగాలి.. బాపూ ఏమని అడగాలి ?
మూగ గుండెలో రగిలే బాధ మూగగానే మిగలాలి
ఎవరిని అడగాలి.. బాపూ ఏమని అడగాలి ?



చరణం 1 :



సిరిమల్లెల విరియించే వసంతం చిగురాకులనే రాల్చేస్తే
సిరిమల్లెల విరియించే వసంతం చిగురాకులనే రాల్చేస్తే
నావను నడిపే చుక్కాని .. ఆ నావను తానే ముంచేస్తే  


ఎవరిని అడగాలి..  బాపూ ఏమని అడగాలి ?  



చరణం 2 :


వలపులు పోసి పెంచిన తీవే కాలసర్పమై కాటేస్తే
వలపులు పోసి పెంచిన తీవే కాలసర్పమై కాటేస్తే
మమతలు పంచిన పాల మనసే మనసును కాస్తా విరిచేస్తే  


ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ?




చరణం 3 :


రాయిని తీసి రవ్వగ చేసి నా ఎదపైనే నిలిపానే ...
రాయిని తీసి రవ్వగ చేసి నా ఎదపైనే నిలిపానే
ఆ రవ్వయె తానొక నిప్పురవ్వయై నా ఎదనే కాల్చేస్తే...    



ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ?
మూగ గుండెలో రగిలే బాధ మూగగానే మిగలాలి
ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ? 





No comments:

Post a Comment