Tuesday, December 9, 2014

ఈ వేళలో నాలో

చిత్రం :  దేవుడు చేసిన పెళ్ళి (1975)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :



ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఆ రాగాల ఉయ్యాల జంపాలలో.. ఎన్నెన్ని కనరాని భావాలో
ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో





చరణం 1 :



చిరుగాలి ఈల వేసే.. చిగురాకు తొంగి చూసే
చిరుగాలి ఈల వేసే.. చిగురాకు తొంగి చూసే


కిరాణాల జడివానలోన..
కిరాణాల జడివానలోన.. వరి చెలు స్నానాలు చేసే


ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
 


చరణం 2 :


పరువాల కొమ్మ పైనా.. పాడింది ఒక కోకిలమ్మ
పరువాల కొమ్మ పైనా.. పాడింది ఒక కోకిలమ్మ


ఆ పాట నా గొంతులోన..
ఆ పాట నా గొంతులోన.. పలికించె నవరాగమాల


ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
 



చరణం 3 :



మేఘాల పరదాలలోనా..
మేఘాల పరదాలలోన .. మెరుపల్లె ఒక రోజు తోచె
ఆ రాజు చిరునవ్వులోనా.. నా మేను నాట్యాలు చేసే 


ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో..  ఎన్నెన్ని రాగాలో 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2031

No comments:

Post a Comment