Sunday, December 28, 2014

అరె ఏమిటి లోకం

చిత్రం : అంతులేని కథ (1976)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి



పల్లవి :



అరె.. ఏమిటి లోకం పలుగాకుల లోకం
అరె.. ఏమిటి లోకం పలుగాకుల లోకం
మమతన్నది ఒట్టి పిచ్చి.. మనసన్నది మరో పిచ్చి
మనాగినా తోసి పుచ్చి.. అనుభవించు తెగించీ 


మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి
మనాగినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ


అరె.. ఏమిటి లోకం పలుగాకుల లోకం



చరణం 1 :


గానుగెక్కి తిరిగితే కాశిదాక పోవునా
పరుల కొరకు పాటుబడితె పడుచుకోర్కె తీరునా
గానుగెక్కి తిరిగితే కాశిదాక పోవునా
పరుల కొరకు పాటుబడితె పడుచుకోర్కె తీరునా 


చీమలను చూచైనా నేర్చుకోవే స్వార్థమూ
వయసు కాస్త పోయినాక మనసున్నా వ్యర్థమూ... ఫటాఫట్


అరె.. ఏమిటి లోకం.. పలుగాకుల లోకం
మమతన్నది ఒట్టి పిచ్చి.. మనసన్నది మరో పిచ్చి
మనాగినా తోసి పుచ్చి.. అనుభవించు తెగించీ


చరణం 2 :


గీత గీచి ఆగమంటే సీత ఆగలేదుగా
సీత అక్కడాగివుంటె రామకథే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే
చేతగాని వాళ్ళు తాము వేసుకున్న కాపులే.. ఫటాఫట్


అరె.. ఏమిటి లోకం పలుగాకుల లోకం



చరణం 3 :



మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ
మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ


సొగసులన్నీ సృష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినపుడె పరువానికి గెలుపులూ.. ఫటాఫట్ 


అరె.. ఏమిటి లోకం.. పలుగాకుల లోకం
మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరోపిచ్చి
మనాగినా తోసి పుచ్చి.. అనుభవించు తెగించీ


అరె.. ఏమిటి లోకం పలుగాకుల లోకం




No comments:

Post a Comment