Monday, December 8, 2014

చేతికి గాజులందము

చిత్రం: వయసొచ్చిన పిల్ల (1975)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి :


చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ
చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ
వయసొచ్చిన పిల్లకు ఆన్నిటి కంటే..
వలపే అందము..  వలపే అందమూ


చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ



చరణం 1 :


కొమ్మకు పువ్వులందము.. పూలకు తావులందమూ

రేయికి చుక్కలందము.. చుక్కలకు చంద్రుడందమూ

రేయికి చుక్కలందము.. చుక్కలకు చంద్రుడందమూ

నీ నల్లని సిగలో తెల్లని మల్లెలు తళుకే అందము.. తళుకే అందమూ


చేతికి గాజులందము... చెంపకు సిగ్గులందమూ



చరణం 2 :


పాటకు రాగమందము.. ఆ...  ఆ.. ఆ.. ఆ..  ఆ
పాటకు రాగమందము.. ఆటకు తాళమందమూ
కళ్లకు కాటుకందము..  కాళ్లకు గజ్జలందమూ
కళ్లకు కాటుకందము.. కాళ్లకు గజ్జలందమూ
నీ వెచ్చని కౌగిట ఊయలలూగే.. బ్రతుకే అందము.. బ్రతుకే అందమూ



చేతికి గాజులందము చెంపకు సిగ్గులందమూ



చరణం 3 :


నింగికి మబ్బులందము.. మబ్బుకు మెరుపులందమూ
మోముకు తిలకమందము.. పెదవికి నవ్వులందమూ
మోముకు తిలకమందము.. పెదవికి నవ్వులందమూ
నీ నీడను తోడును కోరే.. నాకు నీవే అందము.. నీవే అందమూ


చేతికి గాజులందము..  చెంపకు సిగ్గులందమూ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7930

No comments:

Post a Comment