Monday, December 29, 2014

మాఘమాసం మంగళవారం

చిత్రం :  మా దైవం (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  వాణిజయరాం



పల్లవి :



మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు..
పాల్గుణమాసం శుక్కురవారం..
పాల్గుణమాసం శుక్కురవారం బాగుందన్నాడు.. ముహూర్తం బాగుందన్నాడు



చరణం 1 :

ఏటికి అవతల తోటకు ఇవతల కలవాలన్నాడు
ఏడీ లేడని ఇటు ఆటు చూస్తే ఎదురుగ వున్నాడు
నా ఒళ్ళంతా కళ్ళతోనే మెల్లగ కొలిచాడు


చలచల్లగ అల్లరిచేతులు సాచి అల్లుకుపోయాడు
అమ్మమ్మో అల్లుకుపోయాడు.. పెదవులతో చూశాడు అదోలా నవ్వేశాడు   


మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు
పాల్గుణమాసం శుక్కురవారం బాగుందన్నాడు... ముహూర్తం బాగుందన్నాడు



చరణం 2  :


సిగ్గుకు రూపం వచ్చిందంటూ బుగ్గలు నిమిరాడు
పైటకు ప్రాణం వచ్చిందంటూ పట్టుకులాగాడు


ఎందుకు మావా తొందర అంటే ఇదిగా చూశాడు
ఏమనుకోకు ఒకటే ఒక ముద్దిమ్మని అడిగాడు


అమ్మమ్మో అడిగాడు.. ఇచ్చింది ఒకటే గాని ఎన్నోరుచులు నేర్పాడు    


మాఘమాసం మంగళవారం.. మామయ్యొచ్చాడు
పాల్గుణమాసం శుక్కురవారం బాగుందన్నాడు.. ముహూర్తం బాగుందన్నాడు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18104

No comments:

Post a Comment