Friday, December 5, 2014

గాంధీ పుట్టిన దేశం

చిత్రం :  గాంధీ పుట్టిన దేశం (1973)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :

గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం..
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం 

రఘుపతిరాఘవ  రాజారాం.. పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తెరే నాం... సబకో సన్మతి దే భగవాన్ 

చరణం 1 :

భేదాలన్నీ మరచి... మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి... మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడూ నీతికి నిలవాలి

బాపూ ! ఈ కమ్మని వరమే మా కివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు..  అవినీతిని గెలిచే బలమివ్వు  

గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం 

రఘుపతిరాఘవ  రాజారాం పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తెరే నాం సబకో సన్మతి దే భగవాన్ 

చరణం 2 :

ప్రజలకు శాంతి సౌఖ్యం.. కలిగించే దేశమె దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం..  కలిగించే దేశమె దేశం
బానిస భావం విడనాడి..  ఏ జాతి నిలుచునో అది జాతి
బానిస భావం విడనాడి..  ఏ జాతి నిలుచునో అది జాతి 

బాపూ.. నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు 

గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం 

రఘుపతిరాఘవ  రాజారాం పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తెరే నాం సబకో సన్మతి దే భగవాన్
రఘుపతిరాఘవ  రాజారాం పతితపావన సీతారాం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4003

No comments:

Post a Comment