Saturday, December 27, 2014

భోగుల్లో భోగుల్లో

చిత్రం  :  భోగి మంటలు (1972)
సంగీతం  : రమేశ్ నాయుడు
గీతరచయిత  : వేటూరి
నేపధ్య గానం :  బాలు,సుశీల

పల్లవి :

భోగుల్లో భోగుల్లో.. భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల.. భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో

చరణం 1 :

గొబ్బియల్లో గొబ్బియల్లో.. గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు
గొబ్బియల్లో గొబ్బియల్లో.. గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు
 
గుమ్మడంటే గుమ్మడు..మాయదారి గుమ్మడు
కొప్పులో పూలెట్టి..తుప్పర్లోకి లాగాడు  

గొబ్బియల్లో గొబ్బియల్లో..గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 

కుప్పల్లో ఇల్లున్న అల్లుణ్ణే.. కొప్పమ్మ
అత్తింటి కెళదాము రమ్మంటే.. తప్పమ్మా?

తప్పొప్పులిప్పుడే.. తలబోసుకొందామా
తలలంటుకొన్నాక.. కలబోసుకొందామా

గొబ్బియల్లో గొబ్బియల్లో.. గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 

భోగుల్లో భోగుల్లో.. భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల.. భోగుల్లో

తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో

చరణం 2 :

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ.. 

హరి కోసమైతే.. తపస్సులు.. హరి హరీ
హరిదాసుకైతే.. కాసులు.. హరి హరీ
దాసుని తప్పులు దండంతో సరి..ఈ..
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ.. ..మ్మ్ 

సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి
సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి
దండం అంటే రెండర్థాలు..
చేతులు రెండు కలిపేదొకటి.. వాతలు నిండుగ వేసేదొకటి
యేయ్..చేతులు రెండు కలిపేదొకటి.. వాతలు నిండుగ వేసేదొకటి

సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి
సరిలో రంగ సరి.. సరిలో రంగ సరి
సరా హరా.. సరా హరా..మ్మ్..హు..సరి సరీ
హరిలోరంగ హరీ..

భోగుల్లో భోగుల్లో.. భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల.. భోగుల్లో

తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో

చరణం 3 :  

బావలవీపుల తప్పెట్లోయ్.. కాగిన కొద్ది చప్పట్లోయ్
బావలవీపుల తప్పెట్లోయ్.. కాగిన కొద్ది చప్పట్లోయ్
అవి మోగిన కొద్ది ముచ్చట్లోయ్.. మోగిన కొద్ది ముచ్చట్లోయ్

మరదళ్ళు బుగ్గలు బొబ్బట్లోయ్..కొరికినకొద్ది దిబ్బట్లోయ్
హోయ్..మరదళ్ళు బుగ్గలు బొబ్బట్లోయ్..కొరికినకొద్ది దిబ్బట్లోయ్
అవి దొరికేదాకా ఇక్కట్లోయ్..దిబ్బట్లోయ్..బొబ్బట్లోయ్

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల..భోగుల్లో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3769

No comments:

Post a Comment