Tuesday, December 16, 2014

సరిలే పోవే వగలాడి

చిత్రం :  బొమ్మా? బొరుసా?  (1971)
సంగీతం :  ఆర్. సుదర్శనం
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 




పల్లవి :


I say you shut up
Shut up
I say you shut up
Get out
I say you get out
I got you
I hate you
I beat you
I will beat you..


ఆ.. సరిలే పోవే వగలాడి.. నువ్వా నాతో సరిజోడి
ఏహ్.. సరిలే పోవే వగలాడి.. నువ్వా నాతో సరిజోడి
అరె చాల్లే పోవోయ్ బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి
చాల్లే పోవోయ్ బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి


ఆ.. మొద్దా.. ఆ.. ఎద్దా
ఆ.. గూబ.. ఆ.. గేదె
సిగ్గు ఉందా?
శరముందా?
రోషముందా?
మీసముందా?
నువ్వసలూ.. ఆడదానివా?


అరె.. చాల్లే పోవోయ్ బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి
చాల్లే పోవోయ్.. బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి 




చరణం 1 :


ఆ..ఆహా..
నాటురకముదాన్నా.. నీ మాటలు పడతానా
చేతగానివాణ్ణా.. నీ కూతలకోర్చెదనా


ఆ.. వేళ మంచిదయ్యింది.. నీ వీపు పనయ్యేదీ..
ఆ.. పిచ్చి పట్టెనేమో.. తెగ పేలుతు ఉన్నావూ..


చేతయ్యిందేమో చేస్కో.. నీ టెక్కు నీ నిక్కు.. సాగదయ్యో నా ముందూ..
నా దానివి అయిననాడు.. గట్టులెక్కి మెట్టులెక్కి..  నెత్తి మీద కూర్చుందువా..


ఆహా..
ఆహా.. ఊఁ..


అరె చాల్లే పోవోయ్ బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి
ఏహ్.. సరిలే పోవే వగలాడి.. నువ్వా నాతో సరిజోడి


ఆ.. మొద్దా.. ఆ.. ఎద్దా
ఆ.. గూబ.. ఆ.. గేదె
సిగ్గు ఉందా?
శరముందా?
రోషముందా?
మీసముందా?
నువ్వసలూ.. ఆడదానివా?


అరె.. చాల్లే పోవోయ్ బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి
చాల్లే పోవోయ్.. బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి 




చరణం 2 :



ఆ.. ఆహా..


జడలమారిలాగ నువ్వురిమి చూడవద్దు
పోతురాజులాగ నువ్వు హూంకరించవద్దు
అత్త కూతురమ్మో.. నీ పప్పులుడకవమ్మో
ఓ.. బుద్ధిలేని మావోయ్.. నువ్వు హద్దుమీరకయ్యో


గయ్యాళి చిన్నదాన.. గంతులన్ని కట్టి పెట్టి తగ్గు తగ్గు ఇకనైనా..
చెల్లాట లాడవచ్చి.. చిన్నబోయి.. వొణుకుతావు చిచ్చుబుడ్డి బుల్లోడా..


ఆహా.. ఊఁహూఁ..
ఊఁహూఁ..


ఏహ్.. సరిలే పోవే వగలాడి.. నువ్వా నాతో సరిజోడి
అరె చాల్లే పోవోయ్ బుంగమూతి.. నవ్వుతావేందోయ్ పండుకోతి


ఆ.. మొద్దా.. ఆ.. ఎద్దా
ఆ.. గూబ.. ఆ.. గేదె
సిగ్గు ఉందా?
శరముందా?
రోషముందా?
మీసముందా?
ఆ.. నువ్వసలూ.. ఆడదానివా?




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4860

No comments:

Post a Comment