Monday, December 29, 2014

అందమైన చిన్నవాడు

చిత్రం :  భలే దొంగలు (1976)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :



అందమైన చిన్నవాడు అలిగినా అందమే..
అందమైన చిన్నవాడు అలిగినా అందమే
పిలిచిన కొలదీ బిగుసుకుపోయే బింకాలింక చాలు 


నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే..
కాటుక కన్నుల కవ్విస్తావు నాటకమింక చాలు
నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే  



చరణం 1 :


హే.. ప్రేమ వలలోన ప్రియుడు పడగానె.. అలుసు చేస్తారు అమ్మాయిలు


ఏదో సరదాకు మాట అంటేను.. బెట్టుచేస్తారు అబ్బాయిలు
మారాము.. గారాము.. చాలించు.. నీ మారాము గారాము చాలించు  


నంగనాచి.. అహా..  ఆడపిల్ల...  అహా... బొంకినా చెల్లులే 


చరణం 2 :


ఏమికావాలో నీకు ఇస్తాను.. మనసు నీ సొమ్ము చేశానులే


నువ్వు కావాలి నవ్వు కావాలి.. ఇపుడె నాలోన కలవాలిలే
నా ముద్దు ఈ పొద్దు తీరాలి.. నా ముద్దు ఈ పొద్దు తీరాలి



అందమైన... అహా.. చిన్నవాడు..  అహా.. అలిగినా అందమే 

కాటుక కన్నుల కవ్విస్తావు.. నాటకమింక చాలు


నంగనాచి.. అహా..  ఆడపిల్ల...  అహా... బొంకినా చెల్లులే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3608

No comments:

Post a Comment