Sunday, December 7, 2014

ఎగిరే గువ్వ ఏమంది?

చిత్రం :  మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 





పల్లవి :


చం...  చం... చం... ల... ల... ల
ఎగిరే గువ్వ ఏమంది? విసిరే గాలి ఏమంది?
ప్రకృతిలోన స్వేచ్చకన్న మిన్నలేనే లేదంది
ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?... ఓహో


చరణం 1 :



పూలకెందుకు కలిగెనే ఈ ఘుమఘుమలు
ఈ మధురిమలు... డ డ ర డ డ ర డ డ
తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు.. ఈ అమరికలు
స్వేచ్చ కోరే మనసు ఉంటే.. పొందలేనిది ఏముంది
ర ర ర ర ర ర రి...... ర ర ర ర ర ర ర 


ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?.. ఓహో.. హో



చరణం 2 :



కోకిలెన్నడు నేర్చెనే ఈ సరిగమలు సరాగములు
డ డ ర డ డ ర డ డ 
నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు ఈ స్వరజతులు 
స్వేచ్చ కోరే మనసు ఉంటే నేర్వలేనిది ఏముంది  
 
ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?.. ఓహో.. హో


చరణం 3 :


శిరసు వంచక నిలువనా గుడి గోపురమై గిరి శిఖరమునై
డ డ ర డ డ ర డ డ
అవధులన్నీ దాటనా ప్రభంజనమై జలపాతమునై
స్వేచ్చ కోరే మనసు నాది.. ఇంక నా కెదురేముంది
ర ర ర ర ర ర రి... ర ర ర ర ర ర ర..  


ఎగిరే గువ్వ ఏమంది? విసిరే గాలి ఏమంది?
ప్రకృతిలోన స్వేచ్చకన్న మిన్నలేనే లేదంది
ఎగిరే గువ్వ ఏమంది? ఏమంది?... ఓహో

తా ర రా ర...... తా ర రా ర  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1178

No comments:

Post a Comment