Tuesday, December 16, 2014

శరణం నీ దివ్య చరణం

చిత్రం :  మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  భానుమతి  

పల్లవి :

శరణం నీ దివ్య చరణం..  నీ నామమెంతొ మధురం
శరణం నీ దివ్య చరణం.. నీ నామమెంతొ మధురం.. శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం.. నీ నామమెంతొ మధురం.. శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం..  నీ చరణం

చరణం 1 :

భక్తుల బ్రోచే స్వామివి నీవే..  పేదల పాలిటి పెన్నిధి నీవే
భక్తుల బ్రోచే స్వామివి నీవే..  పేదల పాలిటి పెన్నిధి నీవే

సకల జీవులను చల్లగ చూచే.. సకల జీవులను చల్లగ చూచే
కరుణామయుడవు నీవే..  శరణం నీ దివ్య చరణం.. నీ చరణం

చరణం 2 :  

త్రేతా యుగమున శ్రీరాముడవై.. ద్వాపరమందున గోపాలుడవై
త్రేతా యుగమున శ్రీరాముడవై.. ద్వాపరమందున గోపాలుడవై

ఈ యుగమందున వెంకటపతివై..
ఆ ఆ ఆ ఆ..  ఈ యుగమందున వెంకటపతివై
భువిపై వెలసితివీవే.. శరణం నీ దివ్య చరణం.. నీ చరణం

చరణం 3 :

నీ ఆలయమే శాంతికి నిలయం.. నిను సేవించే బ్రతుకే ధన్యం
నీ ఆలయమే శాంతికి నిలయం.. నిను సేవించే బ్రతుకే ధన్యం

తిరుమల వాసా శ్రీ వేంకటేశా.. తిరుమల వాసా శ్రీ వేంకటేశా.. మా ఇలవేలుపు నీవే
శరణం నీ దివ్య చరణం..  నీ నామమెంతొ మధురం..  శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం.. నీ చరణం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4506

No comments:

Post a Comment