చిత్రం : మా దైవం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఏదో ఏదో ఏదో ఉంది... నీ మనసులో
అది ఎప్పటికైన చెప్పక తప్పదు నా మనసుతో.. నా మనసుతో
ఏదో ఏదో ఏదో ఉంది నీ మనసులో
నువ్వు చెప్పకనే అది తెలుస్తుంది నీ కళ్ళలో.. నీ కళ్ళలో
ఏదో ఏదో ఏదో ఉంది... నీ మనసులో
చరణం 1 :
ఓరచూపులో కొంటె ఊహలు ఉరికి ఉరికి పడుతున్నాయి
దోరవయసులో కొత్త సొగసులూ తోడు కోరుకుంటున్నాయి
ఓరచూపులో కొంటె ఊహలు ఉరికి ఉరికి పడుతున్నాయి
దోరవయసులో కొత్త సొగసులూ తోడు కోరుకుంటున్నాయి
వద్దు వద్దంటున్నా కలలోకి వస్తావు..
సద్దు మణిగిందంటే పొద్దు పోదంటావు
వద్దు వద్దంటున్నా కలలోకి వస్తావు..
సద్దు మణిగిందంటే పొద్దు పోదంటావు.. నిద్దరే పోకుండా నన్ను ఊరిస్తావు
ఏదో ఏదో ఏదో ఉంది నీ మనసులో
నువ్వు చెప్పకనే అది తెలుస్తుంది నీ కళ్ళలో.. నీ కళ్ళలో
చరణం 2 :
పెదవి కదలనీ వలపు బాసకు ఓనమాలు దిద్దించావు
కపటమెరుగని కన్నెమనసులో కలవరింతలే రేపావు
పెదవి కదలనీ వలపుబాసకు ఓనమాలు దిద్దించావు
కపటమెరుగని కన్నెమనసులో కలవరింతలే రేపావు
గోరంత చనువిస్తే గుండెలో దూరావు..
మమతతో ముడివేసి మనసునే దోచావు.. వీడని తోడుగా నాలోన నిలిచావు
ఏదో ఏదో ఏదో ఉంది నీ మనసులో
నువ్వు చెప్పకనే అది తెలుస్తుంది నీ కళ్ళలో.. నీ కళ్ళలో
ఏదో ఏదో ఏదో ఉంది... నీ మనసులో
అది ఎప్పటికైన చెప్పక తప్పదు నా మనసుతో.. నా మనసుతో
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=799
No comments:
Post a Comment