చిత్రం : బంగారు బాబు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
చరణం 1 :
పగలంతా ఇద్దరమూ ఆలుమగలమూ.. పడుకునే వేళకూ పక్కలే దూరమూ
పగలంతా ఇద్దరమూ ఆలుమగలమూ.. పడుకునే వేళకూ పక్కలే దూరమూ
ఊరివారికందమూ వుత్తుత్తి కాపురము.. ఊరివారికందమూ వుత్తుత్తి కాపురము
నోరూరుతున్న మనకేమో ఓపలేని.. తాపము . .
అయ్యో.. శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
చరణం 2 :
అన్ని ఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా.. అన్న మాట కోసమే ఆశలన్ని అణచుకున్నా
అన్ని ఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా.. అన్న మాట కోసమే ఆశలన్ని అణచుకున్నా
ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా . . ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా
కన్నెకున్న హద్దులకు కట్టుబడి.. ఊరుకున్నా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
అయ్యయ్యో.. శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
చరణం 3 :
కళ్ళల్లోకి చూడకు.. కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్ళు పడేవరకు మోమాట పెట్టకు
కళ్ళల్లోకి చూడకు.. కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్ళు పడేవరకు మోమాట పెట్టకు
ఆ మంచిరోజు వచ్చును.. హద్దులెగిరిపోవును
మంచిరోజువచ్చును హద్దులెగిరిపోవును
కాచుకున్న వయసు కచ్చి.. అప్పుడే తీరును . .
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1695
No comments:
Post a Comment