Monday, December 29, 2014

ఏనాడు అనుకోనిదీ

చిత్రం :  దొరలు దొంగలు (1976)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :



ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ
ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


వెల లేనిది... కల కానిది... ఇలలోన సరి రానిదీ
ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 1 :


వెన్నెల పొదిగిన దొన్నెలు... కన్నులు
పెదవుల కందించనా.. పరవశ మొ౦దించనా


అందం విరిసిన ఆమని వేళా
విందులు కొదవుండునా.. వింతలు లేకుండునా
వేడుక.. వాడుక.. కాకుండనా...


ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ




చరణం 2 :



కౌగిట అదిమి...  హృదయం చిదిమి
మధువులు కురిపించనా.. మదనుని మురిపించనా   


అందని స్వర్గం ముందు నిలిచితే
ఎందుకు పోమ్మ౦దునా.. ఇది వేళ కాదందునా
తీరిక.. కోరిక.. లేదందునా



ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ
వెల లేనిది.. కల కానిది.. ఇలలోన సరి రానిదీ
ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4610

No comments:

Post a Comment