Saturday, December 27, 2014

కొడితే పులినే కొట్టాలి

చిత్రం :  అల్లుడొచ్చాడు (1976)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  సుశీల, బాలు
   



పల్లవి : 



కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి 


ఆ చెలి కౌగిలిలో.. చలిమంటలు పుట్టాలి.. గిలిగింతలు పెట్టాలి


కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి 


ఆ చెలి కౌగిలికై పది జన్మలు కావాలీ.. పడిగాపులు కాయాలి  



చరణం 1 :


నీలాటి రేవుకాడ నీ లాంటి చిన్నది.. నీళ్ళలో రగిలే నిప్పల్లె వున్నది
చూపు చూసింది.. చురక వేసింది.. మేను కదిలింది.. మెరుపు మెరిసింది
పిల్లను కానూ పిడుగే నన్నది.. పిల్లను కానూ పిడుగే నన్నది
పడితే ఆ పిడుగునే పట్టాలి.. పట్టాలి.. పట్టాలి


కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి..  పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి 



చరణం 2 :


కోటప్ప కొండ మీద కోలాటమాడుతుంటే.. కోవ్వెక్కి కోడెగిత్త నాఫైకి దూకుతుంటే
గడుసైన చినవాడే తోడకొట్టి నిలిచ్చాడే.. కొమ్ములు విరిచేశాడే కోడెను తరిమేశాడే



ఈల వేసి నే రమ్మ౦టే ఎటో జారిపోయాడే
ఈల వేసి నే రమ్మ౦టే ఎటో జారిపోయాడే
పడితే ఆ గడుసొణ్ణి.. పట్టాలి.. పట్టాలి



కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి 


చరణం 3 :


గోల్కొండ ఖిల్లాఫైన గొంతేత్తి పాడితే
ఆకాశం అంచులదాకా నా పాటే మోగితే.. మోగితే ఏమయి౦ది ? 


ఆకాశం కూలిందా పాతాళం పేలిందా?
కాకమ్మ మెచ్చిందా? కోకిలమ్మ చచ్చిందా?... కాదు కాదు


కాలేజి పిల్లకూన  కౌగిట్లో వాలింది.. కాలేజి పిల్లకూన  కౌగిట్లో వాలింది
పడితే ఆ పిల్లికూననే.. పట్టాలి.. పట్టాలి


కొడితే పులినే కొట్టాలి.. కొట్టాలి
పడితే చెలినే పట్టాలి.. పట్టాలి
కొడితే పులినే కొట్టాలి.. పడితే చెలినే పట్టాలి 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4640

No comments:

Post a Comment