Tuesday, December 23, 2014

అల్లిబిల్లి అందమంతా

చిత్రం  :  భోగి మంటలు (1972)
సంగీతం  : రమేశ్ నాయుడు
గీతరచయిత  : వేటూరి
నేపథ్య గానం :  బాలు, శైలజ

పల్లవి :

అల్లిబిల్లి అందమంతా.. అల్లుకుంటే సొంతమంటా..
కల్లబొల్లి మాటలంటే.. హా.. హా.. హా.. హా..రపప.. పా..
కల్లబొల్లి మాటలంటే...  ఒల్లనంటా.. వెళ్ళమంటా
హా.. హా.... హా...

అల్లిబిల్లి అందమంతా.. అల్లుకుంటే అల్లుడంట
మళ్ళీ మళ్ళీ అందమంటా...హా.. హా.. హా.. హా..పప.. పా..
మళ్ళీ మళ్ళీ అందమంటా.. అందకుంటే.. గిల్లుడంట
ఉమ్మ్. ఉమ్... ఉమ్.. ఉమ్... ఉమ్

చరణం 1 :

చుక్కదీపమెట్టుకున్నాక.. దిక్కులన్నీ ఒక్కటయ్యాక..
హే.. హే.. లలలాలాలాలా...
చుక్కదీపమెట్టుకున్నాక.. దిక్కులన్నీ ఒక్కటయ్యాక..
ఈ రేయి విందులో.. ఆరెయ్యి అందమే...
వెయ్యకుంటే ఒట్టంటా.. ఒట్టెయ్యకుంటే ఒట్టంట..

హా.. ఆ..
చందమామ నిద్దరోయాక.. సందడంత సద్దుమణిగాక..

హేహే.. లలలలలలా..

చందమామ నిద్దరోయాక.. హాహహా.. సందడంత సద్దుమణిగాక..
నచ్చేటివాడితో.. మెచ్చేటి మాటుంది
ఇచ్చినంత ఒట్టంట.. ముద్దిచ్చినత ఒట్టంట

అల్లిబిల్లి అందమంతా.. అల్లుకుంటే అల్లుడంట
కల్లబొల్లి మాటలంటే.. హా.. హా.. రురురురు..
కల్లబొల్లి మాటలంటే...  ఒల్లనంటా.. వెళ్ళమంటా
హా.. హా.... హా...

చరణం 2 :

అందినంత పుచ్చుకున్నాక... అల్లరంత చల్లబడ్డాక
హేహే..జుజుజుజుజు..
అందినత పుచ్చుకున్నాక... అల్లరంత చల్లబడ్డాక
ఈ నాటి కౌగిలీ...ఈ.. ఈ.. ఈ రాత్రి  జాబిలి..
వదులుకో వద్దంట.. నన్నొదులుకో వద్దంట

హ.. ఆ.. అందమంత ఆవిరయ్యాక...  పిండమబ్బుచిందులయ్యాక... హేహేహే.. రరరరరర

అందమంత ఆవిరయ్యాక... హహహహా...  పిండమబ్బుచిందులయ్యాక

వరదంటి వయసుని... సరదాల సొగసుని
వలపుగా ఇమ్మంట.. నీ వలపుగా ఇమ్మంట

అల్లిబిల్లి అందమంతా.. అల్లుకుంటే సొంతమంటా..
మళ్ళీ మళ్ళీ అందమంటా...హా.. హా.. హా.. హా..పప.. పా..
మళ్ళీ మళ్ళీ అందమంటా.. అందకుంటే.. గిల్లుడంట
ఉమ్మ్. ఉమ్... ఉమ్.. ఉమ్... ఉమ్  

No comments:

Post a Comment