Monday, December 29, 2014

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే

చిత్రం :  మన ఊరి కథ (1976)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే
కుర్రదానికి ఏ వైఫైనా...  అందమొక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే



కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే
గోదారికి ఏ ఒడ్డైనా....  నీరు ఒక్కటే  



చరణం 1 :


పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి
పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి


గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి
గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి
ఎంత వీలైన వేళైనా తెరచాటు ఉండాలీ


గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే



చరణం 2 :



పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే
పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే


పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే
పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే 


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే
కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే
ఈ కుర్రడికి ఏ పొద్ధూ...  కోరికోక్కటే


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3599

1 comment: