Tuesday, December 9, 2014

పాఠాలు నేర్పేటి పంతులమ్మా

చిత్రం :  దేవుడు చేసిన పెళ్ళి (1975)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   సుశీల, రామకృష్ణ 

పల్లవి:

పాఠాలు నేర్పేటి పంతులమ్మా.. ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా      

ఓ.. లేఖలు అందించే చినవాడా.. ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా

చరణం 1 :

రోజూ ఒక లేఖ రాస్తున్నాను..  అందించాలని అనుకున్నాను

తీరా నిను చూసీ తీయని గుబులేసీ.. తీరా నిను చూసీ తీయని గుబులేసీ
తెచ్చిన లేఖల మాటే మరిచాను..  ఆ మాటే మరిచాను

పాఠాలు నేర్పేటి పంతులమ్మా.. ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా  

చరణం 2 :

ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు .. ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు
ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు..  ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు

నీలో పలికే గీతాలన్నీ.. నీలో పలికే గీతాలన్నీ
నను మరపించే నాగస్వరాలు..  అవే ఈ జన్మకు వరాలు

పాఠాలు నేర్పేటి పంతులమ్మా.. ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా      
ఓ..  లేఖలు అందించే చినవాడా.. ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా

చరణం 3 :

వలచిన మనసే పాఠాలు చెబితే.. పిలచిన కనులే లేఖలు రాస్తే

వలపే పులకించి.. కలలే ఫలియి౦చి

వలపే పులకించి.. కలలే ఫలియి౦చి

మన బ్రతుకే ఒక ఉయ్యాల కాదా.. బంగారు ఉయ్యాల కాదా

పాఠాలు నేర్పేటి పంతులమ్మా.. ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా      
ఓ.. లేఖలు అందించే చినవాడా.. ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా
పాఠాలు నేర్పేటి పంతులమ్మా.. ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2389

No comments:

Post a Comment