Tuesday, December 16, 2014

ఏమని తెలుపనురా

చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971)
సంగీతం: టి. వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం:  సుశీల



పల్లవి :


ఏమని తెలుపను రా.. స్వామీ
ఏమని తెలుపను రా..  ఏమని తెలుపను రా . . 


తొలిచూపులోనే ఏ గిలిగింతలాయెనో
తొలిచూపులోనే ఏ గిలిగింతలాయెనో
ఏమని తెలుపను రా..  ఏమని తెలుపను రా . . 



చరణం 1 :


చిననాటి కథలేవో తెలిపీ..  చేయి కలిపీ
కొనగోట నునుబుగ్గ మీటీ..  కన్ను గీటీ


చెమరించు నా మేను చిరుగాలి వలె తాకి.. ఆ ఆ ఆ ఆ ఆ
చెమరించు నా మేను చిరుగాలి వలె తాకి
మనసు తెలిసి మరులు కురిసి..  కన్నియ మది కరగించిన గడసరివని



ఏమని.. ఏమని.. ఏమని.. ఇంకేమనీ తెలుపను రా
ఏమని తెలుపనురా..  ఏమని తెలుపనురా



చరణం 2 :



ఎదలోని పొదరింట చేరీ.. నన్నే కోరీ
పదునైన తలపేదో రేపీ.. ఆశ చూపీ


రసలోక శిఖరాల కొసలేవొ చూపించి..  ఆ ఆ ఆ ఆ ఆ
రసలోక శిఖరాల కొసలేవొ చూపించి
ఏమనందు ఇంక ముందు.. కేరింతలు పులకింతల తేలింతూ  



ఏమని.. ఏమని..  ఏమని.. ఇంకేమనీ తెలుపను రా
ఏమని తెలుపనురా..  ఏమని తెలుపనురా




No comments:

Post a Comment