Tuesday, January 20, 2015

రేపు వస్తానన్నావు

చిత్రం :  గాజుల కిష్టయ్య (1975)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల
 



పల్లవి :


రేపు వస్తానన్నావు.. ఈ మాపు ఎక్కడ ఉంటావు
నీ కళ్ళలోనే తెల్లవార్లు కాపురముంటాను రేపటికొస్తాను


రేపు ఎంతో తియ్యనిదీ.. నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది


రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది


రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ 



చరణం 1 : 


నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి

నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి


కొత్త కొత్త  సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి
మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొo౦టాయి.. మిడిసిపడతాయి


రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ



చరణం 2 : 


ముసుగు తీయని తామరల్లె నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లె  నీవు వస్తావు


ముసుగు తీయని తామరల్లె నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లె  నీవు వస్తావు


రేకు రేకు గడియ తీసి లేత వయసు తలపు తెరచి
రేపు ఒడిలో రకరకాల రుచులు చూస్తాము.. గెలుచుకుందాము


రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3581

No comments:

Post a Comment