Thursday, January 22, 2015

చినదాని చెవులను చూడు

చిత్రం :  రక్త సంబంధాలు (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల




పల్లవి :


చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ...  ఎందుకో..   ఎందుకో      


చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
మేరిసింది దాని ధగధగ..  ఎందుకో...    ఎందుకో  



చరణం 1 :


కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా
కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా


దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ
దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ
అలరించే మొనగాడు.. ఎవడో    


చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో
 



చరణం 2 :


మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ
మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ


దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ
దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ
విరబూసి పండేది.. ఎప్పుడో


చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో.. ఎందుకో  






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3593

No comments:

Post a Comment