Monday, January 19, 2015

ఇన్ని రోజులింత సొగసు

చిత్రం :  గాజుల కిష్టయ్య (1975)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :

ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?


ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?


ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?


చరణం 1 :


మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది


మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది


సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
నీ చూపులు నాఫై పడినప్పుడే సొగసులు నాలో విరిసేది


ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?



చరణం 2 : 


అందలాన అందీ అందని అందమల్లే నువ్వున్నావు
అందుకోను చేయి జాపే ఆశల్లే నేనున్నాను



అందలాన్ని దిగివచ్చాను.. అందుకొమ్మని చేయిచ్చాను
ఆకు చాటు మల్లెను నేను.. అంతకన్నా ఏం చేస్తాను



ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?



చరణం 3 : 


కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
ఓర్వలేని ఈ విషలోకం విడదీస్తే ఏం చేసేది


మనసిస్తే చాలును నాకు.. నువు మాటిస్తే చాలును నాకు  
మనసులేని మనుషుల మాటే వద్దు ఇంక నీకు నాకూ    



ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3582

No comments:

Post a Comment