Thursday, January 22, 2015

గున్నమామిడీ గుబురులోనా

చిత్రం :  రామయ్య తండ్రి (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :

ఆ..హహా..ఏహెహే...ఒహొ..హో..
లాలాలలలాలలలా.. లా లా.. 


గున్నమామిడీ గుబురులోనా.. కులుకుతున్నా కోయలమ్మా
కమ్మగా ఒక పాట పాడేవా?.. కైపుతో సయ్యాటలాడేవా ? 



ఒహొ..హో..మొలక మీసం దువ్వుకుంటూ.. మురిసిపోయే చిన్నవాడా
సమ్మగా నే పాట పాడేనూ.. మరి గుమ్ముగా నువు తాళమేసేవా



చరణం 1 :



పురివిప్పిన కోరిక నీవై.. పడగెత్తిన పరువం నేనై
పురివిప్పిన కోరిక నీవై.. పడగెత్తిన పరువం నేనై.. 


సెలయేటికి చిందులు నేర్పేమా..
మంచులో చలి మంటలు రేపేమా..
మంచులో చలి మంటలు రేపేమా.. 

ఒహొ..హో..మొలక మీసం దువ్వుకుంటూ.. మురిసిపోయే చిన్నవాడా
సమ్మగా నే పాట పాడేనూ.. మరి గుమ్ముగా నువు తాళమేసేవా




చరణం 2 :



పాలకడలి పొంగును నేనై.. పడి లేచే కెరటం నీవై
పాలకడలి పొంగును నేనై.. పడి లేచే కెరటం నీవై..


గగనానికి గంధం రాసేమా..
సృష్టికే అందాలు పూసేమా
ఈ సృష్టికే అందాలు పూసేమా


గున్నమామిడీ గుబురులోనా.. కులుకుతున్నా కోయలమ్మా

కమ్మగా ఒక పాట పాడేవా?.. మరి గుమ్ముగా నువు తాళమేసేవా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4647

No comments:

Post a Comment