Saturday, February 21, 2015

ఎప్పటివలె కాదురా

చిత్రం :  అభిమానవంతులు (1973)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :


ఎప్పటివలె కాదురా.. ఎప్పటివలె కాదురా ..
నా స్వామీ..   ఎప్పటివలె కాదురా
ఈ ముద్దు ఈ మురిపెమే పొద్దు ఎరుగవు లేరా
ఎప్పటివలె కాదురా.. నా స్వామీ  ఎప్పటివలె కాదురా



చరణం 1 :


పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ ఆ...ఆ...ఆ..
పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ


నిన్నలేని రమణీయరూప నవనీతకాంతితో వున్నానురా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
కులుకు కులుకులో పలుకు పలుకులో లలితరాగములు చిలకరింతురా


ఎప్పటివలె కాదురా..
నా స్వామీ   ఎప్పటివలె కాదురా.... 



చరణం 2 :


పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..
పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..



అందలేని ఆనందలోక నవనందనాల తేలించేనురా
లాలనం నాదిరా పాలనం నీదిరా లాలనం నాదిరా పాలనం నీదిరా
వసంతవేళల రసైకలీలల నిశాంతముల పరవశించేమురా


ఎప్పటివలె..  ఎప్పటివలె కాదురా... నా స్వామి ఎప్పటివలె కాదురా
పా ని స ని గసనిదమ మగసనిదగమగ రినిస
స స రి రి గ గ రిగ రిగ గమ ని గ రి దమని
ఎప్పటివలె కాదురా.. నా స్వామి ఎప్పటివలె కాదురా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4105

No comments:

Post a Comment