Monday, March 23, 2015

మనసు ఒక మందారం

చిత్రం :  ప్రేమ తరంగాలు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 




పల్లవి :


ఉ..హు..ఆ.. ఆ.. ఆ..
లా..లాలాలా.. 


మనసు ఒక మందారం.. చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే.. బ్రతుకు ఒక మధుమాసం





చరణం 1:



ఈ తోటలో..  ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను .. ఎద కదిలించెను


ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా?
వికసింతువా వసంతమా?



మనసు ఒక మందారం... చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే.. బ్రతుకు ఒక మధుమాసం



చరణం 2 :




ఈ చీకటి.. నా లోకము
నీ రాకతో మారాలిరా .. కథ మారాలిరా


ఆ మార్పులో..  నా తూర్పువై
ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా?
వికసింతువా  వసంతమా?



మనసు ఒక మందారం.. చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే.. బ్రతుకు ఒక మధుమాసం

ఆహా..హా.. ఆ... ఆ...ఉమ్మ్..ఉమ్మ్ 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4161

No comments:

Post a Comment