Thursday, July 16, 2015

పైరగాలి వయసు పదహారే

చిత్రం:  ప్రయాణంలో పదనిసలు (1978)

సంగీతం:  శంకర్-గణేష్

గీతరచయిత:  సినారె

నేపధ్య గానం:  సుశీల, రామకృష్ణ


పల్లవి :



పైరగాలి వయసు పదహారే...

ఎపుడు పదహారే...

చందమామ సొగసు జలతారే..ఓహ్..

ఎపుడు.. జలతారే


పైరగాలి వయసు పదహారే... పదహారే

చందమామ సొగసు జలతారే... జలతారే


ఆ గాలిలో చెలి మనసే చిగురాకు

ఆ వెన్నెలలో తొలి వలపే కలువరేకు

ల...ల..ల..లా..

ఆ గాలిలో చెలి మనసే చిగురాకు

ఆ వెన్నెలలో తొలి వలపే కలువరేకు


పైరగాలి వయసు పదహారే... పదహారే

చందమామ సొగసు జలతారే... ఓహ్.. జలతారే


చరణం : 1


నింగిని వదలి మెరుపు తీగ నేలకు దిగుతున్నదా?..ఆ..

నింగిని వదలి మెరుపు తీగ నేలకు దిగుతున్నదా?..ఆ..

తీగను విడిచి లేతగులాబి...

తీగను విడిచి లేతగులాబి... సాగి వస్తున్నదా?

సాగి వస్తున్నదా?


మబ్బుని వదిలి మెరుపుంటుందా.. నీడను విడిచి పూవుంటుందా

మబ్బుని వదిలి మెరుపుంటుందా.. నీడను విడిచి పూవుంటుందా

నీవు లేనిదే నేనుంటానా..

నీవు లేనిదే నేనుంటానా... నేనుంటానా... నేనుంటానా..


పైరగాలి వయసు పదహారే... పదహారే

చందమామ సొగసు జలతారే... ఓహ్.. జలతారే


చరణం : 2


లల..లాలా..హేహే..

హేహే..లలలా..లా


నీ గొంతుకలో రాగం పుడితే.. నా మనసే కోయిలా

నీ గొంతుకలో రాగం పుడితే.. నా మనసే కోయిలా

నీ ఎదలోనా గిలిగింతైతే...

నీ ఎదలోనా గిలిగింతైతే...  నా బ్రతుకే ఊయలా..

 నా బ్రతుకే ఊయలా...


ఏటికి నీటికి కుదిరిన బంధం... గాలికి తావికి కలిసిన బంధం

ఏటికి నీటికి కుదిరిన బంధం... గాలికి తావికి కలిసిన బంధం

మన ఇరువురిని కలిపిన బంధం

మన ఇరువురిని కలిపిన బంధం ... ఈ అనుబంధం ... ఈ అనుబంధం


పైరగాలి వయసు పదహారే... పదహారే

చందమామ సొగసు జలతారే... ఓహ్.. జలతారే


ఆ గాలిలో చెలి మనసే చిగురాకు

ఆ వెన్నెలలో తొలి వలపే కలువరేకు


ఆహా.. హెహెహేహే...

లలలలల.. లాలా..




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8011

No comments:

Post a Comment