Thursday, August 13, 2015

కనరాని నీవే కనిపించినావే

చిత్రం :  మేలుకొలుపు (1978)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  దాశరథి
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :



కనరాని నీవే కనిపించినావే...

అనురాగ వీణ పలికించినావే


కనరాని నీవే..అహా..  

కనిపించినావే...ఆహా..
అనురాగ వీణ..ఆ.. 

పలికించినావే.... ఆ


చరణం 1 :


కలలన్ని నేడు నిజమాయె చూడు....

కలలన్ని నేడు నిజమాయె చూడు
ఏనాటికైనా విడిపోదు తోడూ.... 

ఇన్నాళ్ళు నీకై వేచాను నేను...
ఇనాళ్ళు నీకై వేచాను నేను...
ఎడబాటు దాటి చేరాను నిన్ను.. చేరాను నిన్ను


ఉందాము మనము...  ఒక గూటిలోనే
నడిచేము మనము...  ఒక బాటలోనే



చరణం 2 :


మ్రోగింది అందె..నా రాజు కోసం
వేసింది చిందు.. నా మూగ హృదయం
హృదయాలు రెండు ఉయ్యాలలూగే

హృదయాలు రెండు ఉయ్యాలలూగే
జత చేరి నేడు సైయ్యాటలాడే


కనుపాపలాగా...  నిను చూసుకోనా
పసిపాపలాగా... నిను దాచుకోనా


కనరాని నీవే కనిపించినావే... అనురాగ వీణ పలికించినావే 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7843

No comments:

Post a Comment