Friday, September 11, 2015

జ్యోతిలక్ష్మి చీరకట్టింది





చిత్రం :  సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  జానకి 



పల్లవి :


నమస్కారమండి... ఆయ్.. అవునండి
అయ్యబాబోయ్... ఆ ఈలలెందుకండి.. వచ్చేశానుగా
మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి
"వాయించరా సచ్చినోడా ఊపు కావాలి"
ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ ఓటేల్ కెళ్ళానండి
రూము కావాలి అన్నాను...
డబలా? సింగలా? అన్నాడు.. డబలే అన్నాను
ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు... ఏ.సి.యే అన్నాను
పేరు అన్నాడు... "జ్యోతిలక్ష్మి" అన్నాను


అనగానే గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు...
గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు..
అతుక్కున లేచాడు.. పుటుక్కున విరిచాడు
అతుక్కున లేచాడు.. పుటుక్కున విరిచాడు 


గుర్కా రామ్ సింగ్.. ఆపరేటర్ అజిత్సింగ్
కిళ్ళీకొట్టు కిషన్ సింగ్.. పేపర్ స్టాల్ ధారాసింగ్
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు
ఏమని అరిచారో తెలుసా ....


జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
అయ్యో... బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...


బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...


అని చెప్పి గోల గోల చేసి...
చివరికి రూము నెంబరు నూట పదకొండు ఇచ్చాడు
తీరా తలుపు తెరిచి చూస్తే ..


చరణం 1 :



మంచం పక్కన పగిలిన... గాజు ముక్కలు...
మంచం క్రింద నలిగిన... మల్లెమొగ్గలు
మంచం మీద మిగిలిన... ఆకువక్కలు
మంచం మీద చాటున వొలికిన... పాల చుక్కలు.. పాల చుక్కలు...
కంగారు పడి ఏమిటా అని అడిగాను


ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు...
మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు...
ఆ నిద్దర్లు నాకెప్పుడా అని...
ఆ మంచం మీదే పడుకున్నాను..
పడుకోగానే...


ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... డర్ డర్ డర్ మని బెల్లు
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... డర్ డర్ డర్ మని బెల్లు


ధన్ ధన్ ధన్ మని తలుపు.. ధన్ ధన్ ధన్ మని తలుపు
రా రా రా రమ్మని పిలుపు... రా రా రా రమ్మని పిలుపు
ఏమిటా అని తలుపు తీశాను...
తియ్యగానే...


ఫస్టుఫ్లోరు పాపయ్య.. రెండో ఫ్లోరు రంగయ్య
ఆయ్.. మూడోఫ్లోరు ముత్తయ్య.. లిఫ్ట్ బాయ్ లింగయ్య
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు...
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు...

ఏమని?


జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
అయ్యో.. బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది..
బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...


చరణం 2 :


ఆ తరువాత ఎలాగూ మా ఇంటికి వెళ్ళిపోయాను
తీరా ఇంటికి వెళితే...
గుమ్మానికి మామిడి తోరణాలు...
ఇళ్ళంతా మనుషుల... తిరనాళ్ళు
గదిలో కొత్తవి ఆభరణాలు... గదిలో కొత్తవి ఆభరణాలు
చూసి.. చూడని.. నవ్వుల బాణాలు...


కంగారు పడిపోయి అండి... ఏమిటా అని అడిగానుఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు...అతను చూస్తాడు త్వరగా రమ్మని.. నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు




కూర్చో గానే ...
పెళ్ళికొడుకు తమ్ముడు... తమ్ముడుగారి తండ్రి
హెయ్... తండ్రిగారి తాత... ఆ తాతగారి మనవడు


అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు
అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు
ఏమనో తెలుసా?


జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో... జ్యోతిలక్ష్మి చీరకట్టింది... పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో... బొట్టుకే భయమేసింది... ఊరంతా హోరెత్తింది..
బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...


అని కోపంగా ఎళ్ళిపోయారు...
ఆ అందరి కోసం అలా ఉండమంటారా...
ఇలా చీరకట్టుకోమంటారా...




No comments:

Post a Comment