Wednesday, September 2, 2015

నువ్వూ... నేనూ నడిచింది ఒకే బాట

చిత్రం :  డబ్బుకు లోకం దాసోహం (1973)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి : 

నువ్వూ... నేనూ నడిచింది ఒకే బాట.. ఒకే బాట
నువ్వూ నేనూ పలికింది ఒకే మాట... ఒకే మాట
ఆ బాట రెండుగా చీలిపోయెనా
ఆ మాట నేటితో తీరిపోయెనా.. ఆ బాట రెండుగా చీలిపోయెనా
ఆ మాట నేటితో తీరిపోయెనా
నువ్వూ.. నేనూ నడిచింది ఒకే బాట.. ఒకే బాట




చరణం 1 :


మంచుపొగలు ముసిరితే సూర్యోదయమాగునా
మనసుపొరలు కమ్మితే అసలు నిజం దాగునా
మంచుపొగలు ముసిరితే సూర్యోదయమాగునా
మనసుపొరలు కమ్మితే అసలు నిజం దాగునా


ఆ కిరణాలుదయిస్తే.. ఆ నిజమే ఋజువైతే
కమ్ముకున్న తెరలన్నీ కరిగిపోక ఆగునా.. కరిగిపోక ఆగునా


నువ్వూ . . నేనూ నడిచింది ఒకే బాట.. ఒకే బాట



చరణం 2 :



మచ్చలేని చెలికాడొకడున్నాడనీ
అతను... మమతలన్ని నీపైనే ఉన్నాయనీ
మచ్చలేని చెలికాడొకడున్నాడనీ
అతను... మమతలన్ని నీపైనే ఉన్నాయనీ


నీ నరాల తీగలపై నిజమేదో పలుకునులే
నీ నరాల తీగలపై నిజమేదో పలుకునులే
నీ మనసు అద్దంలో నా బొమ్మ నిలుచునులే . .
నా బొమ్మే నిలుచునులే... 

నువ్వూ... నేనూ నడిచింది ఒకే బాట.. ఒకే బాట
నువ్వూ నేనూ పలికింది ఒకే మాట.. ఒకే మాట




No comments:

Post a Comment