Tuesday, September 29, 2015

అమరం అమరం..మన కథ అమరం




చిత్రం :  ప్రేమ మందిరం (1981)


సంగీతం :  కె.వి. మహదేవన్


గీతరచయిత :  వేటూరి


నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


అమరం అమరం.. మన కథ అమరం

అమరం అమరం.. మన కథ అమరం

ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ... ఏ చరిత్ర వ్రాయని కావ్యం


అమరం అమరం..మన కథ అమరం

ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం ... ఏ చరిత్ర వ్రాయని కావ్యం






చరణం 1 :




అమర ప్రేమికుల ఆత్మకథా

సమాధి రాళ్ళకు అంకితం



యుగాని కొకరు..ఆ యుగాన వారు

ఏ యుగాన అయినా ప్రేమజీవులు..ఒకరే 

ప్రణయ కథలు ఒక్కటే ... ముగింపు విషాదమే 

ప్రణయ కథలు ఒక్కటే ... ముగింపు విషాదమే 


అమరం అమరం..మన కథ అమరం






చరణం 2 :

 

 


ప్రేమ పవిత్రం.. యువతీ యువకుల స్వార్జితం

రాతి గుండెల.. స్వార్థానికి అర్పితం


ప్రేమకు జన్మలు ఏడు... పెళ్ళికి ముడులు మూడు

ఈ మూడు ముడుల బంధం... ఒకే జన్మ అనుబంధం

ఆ ఏడు జన్మల బంధం... ఆ చంద్ర తారార్కం

ఆ ఏడు జన్మల బంధం... ఆ చంద్ర తారార్కం

అది పరిమితం...  ఇది శాశ్వతం


అమరం అమరం.. మన కథ అమరం



చరణం 3 : 







అనురాగానికి మారుపేరు.. అపజయం

ప్రేమ కథలకు తుదిరూపు.. పరాజయం

 

ప్రేమకే ప్రాణాలు పోశారు.. ఎందరో
ఆ ప్రేమే ప్రాణాలు తీసింది.. ఎందరివో

ప్రేమకే ప్రాణాలు పోశారు.. ఎందరో

ఆ ప్రేమే ప్రాణాలు తీసింది.. ఎందరివో

ప్రేమే ప్రణయమై.. ఆ ప్రణయమే మరణమై

ఆ మరణమే అమరమై.. అది అజరామరమై

ప్రేమ చరిత్ర తిరిగి వ్రాసిన.. మన కథ


అమరం అమరం.. మన కథ అమరం

ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం

ఏ చరిత్ర వ్రాయని కావ్యం  

అమరం అమరం.. మన కథ అమరం

 

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1359 



No comments:

Post a Comment