Wednesday, September 2, 2015

గుడిలోన నా స్వామి

చిత్రం :  ఇదా లోకం (1973)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వీటూరి
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి, జానకి



పల్లవి :


గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే    
 

గుడియెనక నా సామి..
గుడియెనక నా సామి... గుర్రమెక్కి కూసున్నాడు
వాడి సోకు సూసి... గుండెల్లో గుబులాయెనే... అబ్బబ్బబ్బబ్బ
ఒళ్ళంత ఏడెక్కెనే.. అయ్యయ్యయ్యో
ఒళ్ళంత ఏడెక్కెనే... అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే



చరణం 1:


సోగ కన్నులవాడు చక్కనైనవాడు... సోగ కన్నులవాడు చక్కనైనవాడు
మొలక నవ్వులే నవ్వుతూ.. వలపు చూపులే రువ్వుతూ
సకల చరాచర జగతికి నాథుడు
నిఖిల సురాసుర ముని గణ వంధ్యుడు
నీల జలద మోహనుడు... మాధవుడు  

        
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు.. సేవకు వేళాయెనే.. సేవకు వేళాయనే 




చరణం 2 :


నాల్గు కన్నులవాడు నాడెమైనవాడు...
కులుకు నవ్వులే నవ్వుతూ.. కొంటి చూపులే రువ్వుతూ
కులుకు నవ్వులే నవ్వుతూ.. కొంటి చూపులే రువ్వుతూ


కైపు మీద ఉన్నాడమ్మో.. కొంగు పట్టి లాగాడమ్మో
కైపు మీద ఉన్నాడమ్మో.. కొంగు పట్టి లాగాడమ్మో
ఎగాదిగా చూసి చూసి.. ఏమేమో అన్నాడమ్మో   

            
గుడియెనక నా సామి గుర్రమెక్కి కూసున్నాడు



చరణం 3 :


గట్టునున్న చీరలే దాచినాడమ్మా
కన్నెల మనసులే దోచినాడమ్మా.. కన్నెల మనసులే దోచినాడమ్మా



ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా.. ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా.. ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా



వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా.. వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా.. వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా



హూయ్యా... బంగారు ముద్దలె మింగుతాడమ్మా.. బంగారు ముద్దలె మింగుతాడమ్మా
పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా.. పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6313

No comments:

Post a Comment